టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు సమర్పించింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, పార్టీ ప్రధానకార్యదర్శి కే కేశవరావు, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కే తారకరామారావు, హరీశ్‌రావు, ఎంపీలు బీ వినోద్, బండ ప్రకాశ్, జే సంతోష్‌కుమార్, వేణుగోపాలాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, రాంబాబుయాదవ్, ఆర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చులను సంబంధిత రాష్ట్ర పార్టీ ఖాతాలో జమచేస్తారు.













