పంచాయతి పోరులో కారు జోరు
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మూడింట రెండు వంతుల సర్పంచ్ పదవులు అధికార పార్టీ బలపరిచిన వారికే దక్కాయి. తొలి విడతలో 4,479 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా.. 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,710 సర్పంచ్ పదవులకు, 28,974 వార్డు సభ్యుల పదువులకు పోటీ జరిగింది. 2,606 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకుంటే, 903 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ బలపర్చిన 30 మంది, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 67 మంది, సిపిఐ బలపర్చిన 19 మంది, సిపిఎం బలపర్చిన 32 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా నిలబడిన 756 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలపొందారు.













