ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వంటేరు యాదవరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తాతా మధు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎం కోటిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠల్ గెలుపోందారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు.. ఉమ్మడి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కశిరెడ్డి నారాయణ రెడ్డి,













