కాంగ్రెస్ పార్టీలోకి డి.శ్రీనివాస్ ?
నిజామాబాద్ సీనియర్ నేత డి శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 1989 నుంచి 2015 జులై వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు. పలు కీలక పదవులు కూడా అనుభవించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే ఇటీవల కాలంలో డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే సోనియాగాంధీతో ఆయన చర్చించారు. ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.













