నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
ఎట్టకేలకు అధికార టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిని ప్రకటించింది. నోముల నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్‌కు టీఆర్ఎస్ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేసే విషయంపై తెలంగాణ భవన్‌కు వచ్చారు. నల్లగొండ జిల్లా నేతలు, మంత్రులతో చర్చించారు. అనంతరం నోముల భగత్ తమ అభ్యర్థి అని ప్రకటించారు. మంగళవారం ఉదయం భగత్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ భగత్‌కు బీఫాం ఇచ్చారు. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోటిరెడ్డి, చిన్నపరెడ్డికి సీఎం సూచించారు.













