ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నవీన్‌రావు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఎన్నిక ఖాయమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం వరకు ఆ స్థానానికి నవీన్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత నవీన్ రావు ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడనుంది. నవీన్‌రావు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులకు సమర్పించారు. ఆయన వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి ఉన్నారు.













