వరంగల్ గ్రేటర్ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి బుధవారం తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లు ఉండగా, తొలి జాబితాలో భాగంగా 18 డివిజన్లకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ తొలి జాబితా అభ్యర్థులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు బీఫాంలను అందజేశారు.
2 వ డివిజన్ — బానోతు కల్పన, 5 వ డివిజన్….. తాడిశెట్టి విద్యాసాగర్, 7వ డివిజన్…. వేముల శ్రీనివాస్, 13 వ డివిజన్… సురేశ్ జోషి, 15వ డివిజన్…. ఆకులపల్లి మనోహర్, 16వ డివిజన్… సుంకరి మనీషా, 17వ డివిజన్… గద్దె బాబు, 23వ డివిజన్… లీలావతి సత్యనారాయణ, 27వ డివిజన్… జారతి రమేశ్, 29వ డివిజన్… గుండు సుధారాణి, 38వ డివిజన్… ఉమా దామోదర్, 45వ డివిజన్… నాగేశ్వర రావు, 51 వ డివిజన్…. రంజిత్ రావు, 55వ డివిజన్… రంజిత వెంకటేశ్వర్లు, 56వ డివిజన్…. సరింగి సునీల్ కుమార్, 57వ డివిజన్…. నల్ల స్వరూపా రాణి, 64వ డివిజన్… ఆవాల రాధిక నరోత్తం రెడ్డి, 65వ డివిజన్… దివ్యారాణి రాజు నాయక్
అందుకే అందరికీ టిక్కెట్లు రాలేదు : ఎర్రబెల్లి
సామాజిక సమీకరణాల వల్లే టీఆర్ఎస్లో అందరికీ టిక్కెట్లు ఇవ్వలేకపోయామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. టిక్కెట్లు రానివారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా చెప్పారని తెలిపారు. టిక్కెట్లు వచ్చిన వారు టిక్కెట్లు రాని వారిని కలుపుకొని వెళ్లాలని, అలాగే ప్రచారం కూడా చేయాలని మంత్రి ఆదేశించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఎర్రబెల్ల దయాకర్ రావు హెచ్చరించారు.













