టీఆర్ఎస్ సంచలన నిర్ణయం
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల లోపు కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ రూపకల్పనకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి పలువురు జాతీయ నేతలను కలిసి వస్తున్న కేసీఆర్ ఇక ఢిల్లీ నుంచే జాతీయ రాజకీయం షురూ చేయాలని భావిస్తునట్లు తెలిసింది. త్వరలో హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఆ పార్టీ ఓ ప్రెస్‌నోట్‌ను కూడా విడుదల చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ కార్యాలయాన్ని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో నిర్ణయిస్తారని, అనంతరం శంకుస్థాపన చేయనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. సంక్రాంతికి శంకుస్థాపన చేసి మూడు నెలల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యే విధంగా టీఆర్ఎస్ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.













