వరద బాధితులకు ఎన్నారై యూకే బృందం సహాయం
హైదరాబాద్లోని వరద బాధితులకు టీఆర్ఎస్ ఎన్నారై యూకే బృందం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. వరద బాధితులకు సాయం చేయాలనే సంకల్పంతో ‘‘వీ కేర్ మేమున్నాము’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. నిత్యావసర సరుకులతో పాటు జ్వరం, జలుబు మరియు ఇతర నొప్పులకు ఉపయోగపడే మందులను డాక్టర్ సలహా మేరకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మొదటి విడతగా సుమారు 300లకు పైగా కిట్లను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశామని తెలిపారు. సుమారు 200 కిట్లను ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు అశోక్ గౌడ్ సృష్టం చేశారు. ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల టీఆర్ఎస్ ఎన్నారై బృందాన్ని మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరిని మరియు కార్యవర్గ సభ్యులని ఆయన ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎన్నారై యూకే నాయకులు మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.













