హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రచారం
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ ప్రచారం చేయాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తామని సౌత్ అఫ్రికా ఎన్నారై శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనుల గురించి గడపగడపకు ప్రచారం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తమకుందని, త్వరలో తమ ప్రచార షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.













