టీఆర్ఎస్ సౌత్ఆఫ్రికా అధ్యక్షుడికి అభిస్తి సేవా పురస్కారం
అభిస్తి సేవా పురస్కార్ అవార్డును టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అందుకున్నారు. హైదరాబాద్లో జరిగిన అభిస్తి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఈవార్డును ఆయనకు ప్రదానం చేశారు. హైదరాబాద్లో 2020లో కరోనా, వరద బీభత్సం సృష్టించిన సంగతి విధితమే. అభిస్తి వెల్ఫేర్ సొసైటీ, బాగీస్ ఫుడ్ కోర్ట్ సహకారంతో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీకి టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా తమవంతు సాయం చేసింది. ఈ మేరకు ఈ పురస్కారాన్ని ఆ శాఖ అధ్యక్షుడు నాగరాజు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హరీష్రంగా, సాయి వేముల పాల్గొన్నారు.













