పార్టీ అధినేతగా మళ్లీ కేసీఆర్ ఉండాలి : మహేష్ బిగాల
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నారైల తరపున టీఆర్ఎస్ ఎన్నారైల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ భవన్లో రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధినేతగా మళ్లీ కేసీఆర్ ఉండాలని పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారన్నారు. ఎన్నారైలందరూ పార్టీ అధ్యక్షుడిగా కావాలని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారని అన్నారు. ఎన్నారైల తరపున పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, హరీష్ రంగ, సౌజన్ రావు, సాయి కిరణ్ వేముల, మాల్దీవుల నుంచి రాకేశ్ దత్తాత్రేయరా, కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిసాల, జగదీశ్ ఉప్పల, యూకే శాఖ నుంచి రత్నాకర్ కడుదుల, రమేష్ ఎస్పంపల్లి, శ్రీనివాస్ వల్లల, మల్లేష్ పప్పు, తాటికుంట వేణుగోపాల్, ప్రవీణ్ పంతులు, సుభాష్ కోరుపల్లి, తాటికుంట జనార్దన్ రెడ్డి, జాంబియా నుంచి రాహుల్ రెడ్డి, వియత్నాం నుంచి క్రాంతి కుమార్, ఇటలీ నుంచి వినయ్, ఆస్ట్రియా నుంచి వివేక్, ఫిన్లాండ్ నుంచి సందీప్, ఇటల నుంచీ వినయ్ తదితరులు పాల్గొన్నారు.













