హోప్ 4 స్పందన లో పాల్గొన్న తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
అమెరికా లో న్యూజెర్సి కి చెందిన స్వచ్ఛంద సేవాసంస్థ హోప్ 4 స్పందన శర్వాని కోట గారి ఆధ్వర్యంలో వారి సహౕయ సహకారంతో వికలాంగులకు ఈరోజు చేయూత అందజేశారు. ఈ కార్యక్రమమంలో భాగంగా పీవీ వాణి దేవి, మహేష్ బిగాల, సినీ నటి అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేటీర్ గారి బర్త్ డే సందర్బంగా మహేష్ బిగాల గారు గిఫ్ట్ ఏ స్మైల్ భాగంగా 10 మంది వికలాంగులకు చేయూత అందజేశారు. మహేష్ బిగాల మాట్లాడుతూ కేటీర్ గారు ఉద్యమకారుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో మొదటిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి నుంచి సిరిసిల్ల పట్టణాభివృద్ధిపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో.. నేడు మంత్రిగా ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగానూ రాష్ట్రాభివృద్ధి పట్ల అంతే శ్రద్ధను కనబరుస్తున్నారు. ఈ సందర్బంగా కేటీర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.













