మునుగోడులో టీఆర్ఎస్దే ఘన విజయం : మహేశ్ బిగాల
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నిక తీసుకొచ్చారని,, ఆయన ఓటమి ఖాయమని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా శాఖ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో సమావేశం జరిగింది. దీనికి మహేశ్ బిగాల, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడు సీఎం కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మునుగోడులో పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గురించి చర్చిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటరమణారెడ్డి, రవీందర్ చింతామణి, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.













