కల్వకుంట్ల కవిత కు శుభాకాంక్షలు తెలిపిన తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
నిజామాబాద్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని నివాసంలో శనివారం తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మర్యాద పూర్వకంగా కలిశారు, పుష్పగుచ్ఛము అందించి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచములోని 50 దేశాల ఎన్నారై శాఖల తరపున శుభాకాంక్షలు తెలిపారు, తెరాస ఎన్నారై మొదలు పెట్టినప్పటినుంచి కవిత గారు ఎప్పటికప్పుడు తెరాస ఎన్నారై వింగ్స్ కి సహాయ సహకారాలు అందిస్తూ వెన్ను దన్నుగా నిలిచారు.ఎమ్మెల్సీ గ ఎన్నికైన తరువాత ఇప్పటిదాకా వున్నా వెలితి ని పూరించారు. త్వరలోనే కవిత గారు మంత్రి వర్గములో చేరాలని ఆశాభావం వ్యక్తం చేసారు.













