గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నేతలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ నేతలు ప్రత్యక్షంగా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట, కర్మన్‌ఘాట్‌లో జరిగిన మంత్రి కేటీఆర్ రోడ్ షోలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచన మేరకు వివిధ దేశాల నుంచి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా, మరికొంతమంది ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు మరోమారు టీఆర్ఎస్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.













