సీఎం కేసీఆర్ కు మహేష్ బిగాల శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మశేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఆయన మూడు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన వేడుకలను 50 దేశాల్లో ఘనంగా నిర్వహస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు సంఘీభావంగా మొక్కలను నాటడంతో పాటు అనాథలకు సహాయం అందించామని తెలిపారు. రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.













