ప్రధాని మోదీపై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చిన టీఆర్ఎస్
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ఆ పార్టీ ఎంపీలు కే కేశవరావు, సంతోష్ కుమార్, సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్ కలిసి నోటీసు అందజేశారు. ప్రధాని అభ్యంతరకంగా మాట్లాడారని 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్రధాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన అవమాపరనంగా జరిగిందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలపై అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి.













