లోక్సభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నాల్గవరోజు కూడా నిరసనల గళమే వినిపిస్తోంది. ధరల పెంపు, జీఎస్టీ అంశాలపై కేంద్రం మొండి వైఖరిని అవలంభిస్తోంది. ఈ అంశాలను చర్చించాలని కోరినా, పార్లమెంట్లో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యలు నినాదాలతో హోరెత్తించారు. ధరల పెంపు, జీఎస్టీ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్ర సర్కార్ మొండి విధానాన్ని పాటించింది. ప్రజా సమస్యలపై చర్చించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పట్టుపట్టారు. కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేవారు. టీఆర్ఎస్తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ కూడా సభ నుంచి వాకౌట్ చేశాయి.













