పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహ నిరసన ప్రదర్వన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేవు. ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతోంది. ధరలను నియంత్రించడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం అవుతున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు గాందీ విగ్రహం ముందు ప్లకార్డులు ప్రదర్శించి, మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేశవరావు, నామానాగేశ్వరరావు, సంతోష్, దివకొండ దామోదర్రావులతో పాటు ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.













