ప్రధానితో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ భూముల వ్యవహారంపై ప్రధానికి వినతిపత్రం అందించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రక్షణ భూముల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తామని, దాని ద్వారా 44వ నంబర్ జాతీయ రహదారి, ఒకటో నంబర్ రాష్ట్ర రహదారి అనుసంధానికి అనువుగా ఉంటుందని ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి జలననరులకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టును కేటాయించాలని కోరినట్లు సమాచారం. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించేందుకు బైసన్పోల్, జింఖానా మైదానాల్లో ఏదొకటి కేటాయించాలని వారు ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.













