రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే నిరసనలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకుకు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం మేరకు ఎంపీలు ప్రసంగాన్ని బహిష్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ప్రాంగణంలో మహాత్ముడి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం సమయంలో విపక్షాలు నినాదాలు చేశాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్న పార్లమెంట్ ఉభయ సభలకు టీఆర్ఎస్కు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ దూరంగా ఉన్నట్లు లోక్సభలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.













