రామప్ప కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి: టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయానికి రూ.250 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. భద్రాచలం ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని, మేడారం జాతరకు జాతీయహోదా కల్పించి అభివృద్ధి చేయాలని విన్నవించారు. కేంద్రమంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు పలు అంశాలపై చర్చించారు. మహబూబాబాద్ పర్యాటకంగా అభివృద్ధి చెంది, ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రమంత్రిగా చొరవ తీసుకోవాలని అన్నారు. తెలంగాణ బిడ్డగా పూర్తి సహకారం అందించాలని కిషన్ రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణమన్నారు.













