ఇది వాళ్లకు క్రాంతి దినం : నామా
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, విభజన బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. చరిత్ర చేసిన తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత భూభాగం కావాలన్నారు. లోక్‌సభలో నామా మాట్లాడుతూ కశ్మీర్ అభివృద్ధిలో అందరం భాగస్వాములం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యతో కశ్మీర్ ప్రజల జీవితాలు మారనున్నట్లు చెప్పారు. కశ్మీరీల జీవితాలు మారుతుంటే, అప్పుడు వాళ్లకు అది చీకటి రోజు ఎందుకు అవుతుందని, ఇది వాళ్లకు క్రాంతి దినమని తెలిపారు. సుందర కశ్మీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బిల్లుతో జమ్మూకశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే దేశద్రోహులుగా చూస్తారన్నారు. కశ్మీర్‌కు విరోధులుగా భావిస్తారన్నారు. అందుకే బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి ఉందన్నారు.













