కవిత రాఖీ ప్రచారానికి జ్యోతిరాదిత్యా సింధియా మద్దతు
రాఖీ పండుగ సందర్భంగా రాఖీతో పాటు అన్నయ్యలకు హెల్మెట్ తప్పనిసరిగా బహుమానంగా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రచారం చేస్తున్న విషయం విదితమే. కవిత ప్రచారానికి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యా సింధియా మద్దతు ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కవిత అవగాహన కల్పించడం సంతోషాన్నిస్తుందన్నారు. ఆమె ప్రయత్నానికి మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. డ్రైవ్ సేఫ్ రైడ్ సేప్ అని పేర్కొంటూ సిందియా ట్వీట్ చేశారు. సింధియా ట్వీట్‌కు కవిత థ్యాంక్స్ తెలిపారు. చెల్లెమ్మలకు అన్న రక్ష అయితే అన్నకు హెల్మెట్ రక్ష అని కవిత పేర్కొన్నారు.













