నిరాడంబరంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి 20 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సెక్రెటరీ జనరల్ కే. కేశవరావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్గి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ అకుంఠిత కార్యదీక్షతో గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని, కేసీఆర్ పట్టువీడని ఉక్కు సంకల్పం, కార్యదీక్షతోనే తెలంగాణ సాధ్యమైందని కేకే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో కార్య సాధన పూర్తి కాలేదన్నారు. బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తుగా అనుకున్న దాని ప్రకారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో వేడుకలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.













