ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి నామినేషన్
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలకు నామినేషన్ పత్రాలను వాణీదేవి సమర్పించారు. అంతకు ముందు పీవీ ఘాట్‌కు వెళ్లిన ఆమె మంత్రి తలసాని, కె.కేశవరావుతో కలిసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెడతానని వాణీదేవి అన్నారు. అక్కడి నుంచి వారు ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేవమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు బీఫామ్ అందజేశారు. వాణిదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోరారు. పీవీకి సరైన గౌరవం దక్కాలంటే వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.













