కేసీఆర్ చేసిన సర్వేలో.. కేటీఆర్, హరీశ్ రావు తర్వాత నేనే
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకుడు ఎవరని కేసీఆర్ చేసిన సర్వేలో కేటీఆర్, హరీష్ తర్వాత తానే ఉన్నానని చెప్పారు. ఘనపురం గురించి మాట్లాడే వారికి అడ్రస్ తో పాటు ఓటు కూడా లేదని విమర్శించారు. పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే కుట్రలో గుంటనక్కలు గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కళ్లులేని కబోదీలకు కనబడడం లేదని ప్రశ్నించారు. నోరుందని ఏదీపడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తాటాకు చప్పుళ్లకు బయపడేవారు ఎవ్వరు లేరన్నారు. ప్రజాబలం అనేది ఓట్లతోనే తెలుస్తుందని, స్థానికుడే నాయకుడైతే ఏ రకంగా ఉంటుందో కళ్లకు కనిపిస్తుందన్నారు.













