మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ
మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన విషయం విదితమే. ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా మునుగోడుకు విచ్చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ప్రజలకు అభివాదం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల ఓట్ల తేడాతో కూసుకుంట్ల గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.













