ఆయన రాజకీయ పర్యాటకుడు.. రైతు ప్రతినిధి కాదు : జీవన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు రాజకీయ పర్యాటకుడిగా మారారని, ఆయన రైతు ప్రతినిధి కాదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. టీఆర్స్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డికి వ్యవసాయం, ధాన్యం గురించి తెలియదని అన్నారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడితేనే కిషన్‌రెడ్డిని మొనగాడంటామని వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతుల కోసం కేంద్రం నుంచి 10 వేల కోట్లు తేవడం చేతకాని వ్యక్తి కిషన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. ట్రిపుల్ ఆర్ అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ రెచ్చ గొట్టడం, రచ్చ చేయడం, రద్దు చేయడం పార్టీగా మారిందని విమర్శించారు. నోట్లతో ఓట్లు కొనడం తెలిసిప టీపీసీసీ అథ్యక్షుడు రేవంత్‌రెడ్డి కి వడ్డ కొనుగోలు ఏం తెలుసనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లీజుకు తీసుకున్నారని, ఆయనకు దమ్ముంటే తెలంగాణ రైతుల కోసం ప్రధాని మోదీ ఇంటి ముందు సోనియా, రాహుల్‌ను ధర్నాకు కూర్చోబెట్టాలన్నారు.













