ఇప్పుడు ఆ పని చేసి.. ఉద్యమానికి సిద్ధం కావాలి
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పసుపు బోర్డు ఏమైందో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గన్‌పార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పిందన్నారు. ఎన్నికల సమయంలో బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపీ అర్వింద్, ఇప్పుడు ఆ పని చేసి ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గరికి వెళ్లి పసుపు బోర్డుపై మాట్లాడాలన్నారు. బీజేపీ అంటే అ•ద్ధాల పార్టీ అని, అమ్మకం పార్టీగా మారిందని విమర్శించారు. ప్రతిరోజూ ఏదో ఒక సంస్థను బీజేపీ అమ్ముతోందని ఆక్షేపించారు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు, రైల్వే కోచ్ ఇవ్వమని కేంద్రం చెప్పిందని దానిపై పోరాడాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పడానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌కు గంటకు పైగా సమయం పట్టిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలు నమ్మరని అన్నారు.













