మరో మూడు దేశాల్లో టీఆర్ఎస్ మిషన్ ప్రారంభం
టీఆర్ఎస్ మిషన్ క్యాంపెయిన్ కార్యాలయాలు మరో మూడు దేశాల్లో ప్రారంభమయ్యాయి. యూరప్‌లోని డెన్మార్క్‌లో టీఆర్ఎస్ ఎన్నారైశాఖ అధ్యక్షుడు శ్యామ్‌బాబు ఆకుల ఆధ్వర్యంలో క్యాంపెయిన్ కార్యాలయాన్ని కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల స్కైపీ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యామ్‌బాబు మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి కాల్ క్యాంపెయిన్‌తోపాటు, నేరుగా తెలంగాణకు వచ్చి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి ప్రచారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రసాద్‌రావు కలకుంట్ల, ఉపాధ్యక్షులు సతీశ్ గామినేని, జయచందర్ గంట, శివకుమార్‌రెడ్డి గడ్డం, సంతోశ్ గంజి, విశాల్ వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి కంకణాల, చంద్రశేఖర్ పెంటపాటి, డెన్మార్క్ జాగృతి అధ్యక్షుడు సంతోశ్‌రావు బోయినపల్లి, నరేందర్‌రెడ్డి ఎడమల, బండారి శ్రీనివాస్, సునీల్ మహాజన్, కిశోర్ కలకుంట్ల తదితరులు పాల్గొన్నారు. ఇటలీ, ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలోనూ కాల్ క్యాంపెయిన్ కార్యాలయాలు ప్రారంభించారు.













