అందుకే తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి
సికింద్రాబాద్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ముసుగులో కొంతమంది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలసి చేసిన కుట్రలో భాగమే ఈ అల్లర్లు అన్నారు. ఇంత మంది ఆందోళనకారులు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి ఇది. ముసుగులు వేసుకుని వచ్చి దాడికి పాల్పడ్డారు. అందుకే తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలన్నారు. అగ్నిపథ్ పేరుతో అభ్యర్థులకు అన్యాయం చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. కొందరు వారిని తప్పదారి పట్టిస్తున్నారు. దేశ ప్రజల ఆస్తి, మన ఆస్తి, రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రాష్ట్రం వ్యవహరిస్తోంది. నిన్నటి కాంగ్రెస్ దాడి, ఇవాళ్టి అల్లురు పూర్తిగా టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే జరిగాయి అని ఆరోపించారు.













