మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన తీగల
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ను నాశనం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మంత్రి సబితా భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. చెరువులను, స్కూల్ స్థలాలను కూడా వదలడం లేదన్నారు. వీటిపై అవసరమైతే ఆమరణ దీక్ష కూడా చేస్తానన్నారు. తమ పార్టీ నుంచి సబితా గెలవలేదన్నారు. అభివృద్ధిని ఆమె గాలికొదిలేశారని విమర్శించారు. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తీగల తెలిపారు.













