బీజేపీలోకి డీఎస్ తనయుడు
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అరవింద్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. నేడో, రేపో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షంలో చేరనున్నారు. ప్రస్తుతం నవయుగ సంస్థ రియల్ డైరెక్టరు హోదాలో ఉన్న అరవింద్ 1992-96 మధ్య హైదరాబాద్ క్రికెట్ జట్టు రంజీ ఆటగాడిగా కొనసాగారు. 1996లో కాలికి తీవ్రగాయమవడంతో ఆటకు దూరమయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పట్నుంచి ఆయనను అభిమానిస్తూన్నా. 2011లోనే బీజేపీలో చేరాలనుకున్నాను. అప్పట్లో కొన్ని కారణాల వల్ల చేరలేకపోయా అని అన్నారు. నేడు అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశముందని తెలిపారు. వాయిదా పడితే, ఒకట్రెండు రోజుల్లో చేరతానన్నారు.













