టీడీపీలోకి బుడాన్ బేగ్
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఐడీసీ) చైర్మన్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బుడాన్ బేగ్ కారు దిగి సైకిల్ ఎక్కనున్నారు. ఈ నెల 28న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కుండువా కప్పుకోనున్నారు. 2014 ఎన్నికల్లో బుడాన్ బేగ్ ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు ఏడాదిన్నర కిందట ఆయనను రాష్ట్ర ఐడీసీ చైర్మన్‌గా కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఈ నెల 19న ఖమ్మంలో జరిగే కేసీఆర్ సభలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. టీఆర్ఎస్ను వీడే క్రమంలో బేగ్ టీడీపీకి చెందిన ఓ కీలక నేతతో సమావేశం అయినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నేతలు కొందరు బేగ్‌తో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమచారం.













