ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ 21 ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూరా వాడవాడలా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం కేకులు కట్చేసి, స్వీట్లు పంచి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్ పోరాట పటిమ, విద్యార్థుల తెగువతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ముక్త కంఠంతో నినదించారు.













