ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం: తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్యయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు. ఈ సందర్బంగా తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెరాస ఎన్నారై శ్రేణులు వారి వారి దేశాలలో కోవిద్ నిబంధనలు అనుసరించి ఘనంగా జెండా పండగ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ సారి పరిమిత ఆహ్వానితులు 15 – 20 దేశాల ప్రతినిథులు మాదాపూర్లోని హెచ్ఐసీసీలో పాల్గొంటున్నారు అని తెలిపారు.













