విదేశాలలో అంగరంగ వైభవంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
-40 దేశాలలో జరగనున్న వేడుకలు
-టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
టీఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరపాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సందర్బంగా విదేశాలలోను గతంలో నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపాలని టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పార్టీ ఎన్నారై శాఖలకు నిర్దేశించారు.
మహేష్ మాట్లాడుతూ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, లండన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బెహ్రెయిన్ తదితర దేశాలలో ఘనంగా జరపునున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలలో జెండా ఆవిష్కారణకు కూడా సన్నాహాలు జరుగుతున్నయిరన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారి సారథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అకాండ మెజారిటీతో రెండవసారి కొలువుదీరిన నేపథ్యంలో గౌరవ కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్న తర్వతా వచ్చిన మొదటి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వించబోతున్నామన్నారు.
ఎన్నికల తర్వాత నిర్వహించబోయే ప్లీనరీ కి ప్రతిసారి లాగా 40 దేశాల నుండి ఎన్నారైలు రావడానికి అన్ని ఏర్పాటులు చేస్తున్నామన్నారు.













