అతివిశ్వాసమే కొంపముంచింది
అతివిశ్వాసం వల్లే లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా మోదీ హవా బీజేపీకి కలిసొచ్చిందని తెలిపారు. పుల్వామా, బాలాకోట్ ఘటనలు జాతీయవాదాన్ని మేల్కొలిపాయని చెప్పారు. అవినీతి, నిరుద్యోగం అంశాలను ప్రజలు ఈ ఎన్నికల్లో పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీజేపీ విధానాలపై స్పందిస్తామన్నారు. జరిగిన లోపాలను రాబోయే రోజుల్లో సవరించుకుంటామని సృష్టం చేశారు. తాను పదవులపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆశయంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సాధనతోనే టీఆర్ఎస్ ఉద్యమం ముగియలేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల సమస్యల కోసం పని చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.













