అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటు వేయాలి : వినోద్ కుమార్
ఈటల రాజేందర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ప్రజల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ జమ్మికుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జమ్మికుంట, హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేయాలని మిగతా విషయాల గురించి ఆలోంచాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వేలైన్ల కోసం ఎంతో శ్రమించానని గుర్తు చేశారు.













