బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి : డెన్మార్క్ శాఖ
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ వ్యవస్థాపకుడు ఆకుల శ్యామ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ విస్తరణకు ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పారు. డెన్మార్క్ ఏర్పాటు చేసిన శ్యామ్ మాట్లాడుతూ గుజరాత్ మాడల్ ఫెయిల్ అయిందని, దేశానికి తెలంగాణ మాడల్ అవసరమని చెప్పారు. కేసీఆర్ భారతదేశాన్ని అభివృద్ధి చేసి దేశబంధుగా కీర్తిపొందుతారని తెలిపారు. సమావేశంలో డెన్మార్క్ శాఖ అధ్యక్షుడు గంట జయచందర్, జనరల్ సెక్రటరీ కలకుంట్ల ప్రసాద్‌రావు, వైఎస్ ప్రెసిడెంట్ విశాల్ వెంకట్‌శెట్టి, గడ్డం రాజిరెడ్డి, పల్లె చందు, కట్టు సురేష్, బండారి శ్రీనివాస్, మిల్కా సాయికృష్ణ, ఏలేటి మహేశ్, సునీల్ మహాజన్, గూడూరి నవీన్ పాల్గొన్నారు.













