జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పదవి కోసం బీజేపీ తరపున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్‌రెడ్డి నామినేషన్ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ ఎన్నికలో ఎంఐఎం కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు తెలిపింది. డిప్యూటీ మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్, ఉప మేయర్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.













