హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి రికార్డు
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు బ్రేక్ చేశారు. 20వ రౌండ్ ముగిసేసరికి సైదిరెడ్డి 40,547 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు 2009 ఎన్నికల్లో 29,194 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలవగా.. ఇప్పుడు ఆ రికార్డును 15వ రౌండ్లోనే సైదిరెడ్డి అధిగమించారు. 15వ రౌండ్ ముగిసేసరికి సైదిరెడ్డి 29,967 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పటి వరకు హూజుర్‌నగర్ శాసనసభకు ఏడు సార్లు ఎన్నికలు జరగ్గా.. ఇంత మెజార్టీ ఏ అభ్యర్థికి కూడా రాలేదు.













