సీఎం కేసీఆర్ వల్లే అది సాధ్యం … కాసర్ల నాగేందర్
దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతి రాష్ట్రం తెలంగాణ మోడల్ని కోరుకుంటోందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లే అది సాథ్యమని నమ్ముతున్నారన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే సత్తా ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం ఆస్ట్రేలియా నుండి టీం ప్రత్యేక కార్యచరణతో వస్తుందన్నారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కాన్బెర్రలో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని ఎసిటీ కన్వీనర్ రవి సాయల అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దిశా నిర్దేశం ప్రకారం నూతన జాతీయ పార్టీకి సేవలందిస్తామన్నారు. ఈ సమావేశంలో రaాన్సి, రాజేష్ లక్కరసు, వీరేందర్, అనిత, ఉగ్గం, రమేష్, సుషుత్, శ్రీనివాస్, రుద్ర సభ్యులు పాల్గొన్నారు.













