సాగర్ గెలుపుపై ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ సంబురాలు

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‍ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సందర్భంగా ఆస్ట్రేలియా లోని కాన్బెర్రలో టీఆర్‍ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍కు, విజయం సాధించిన ఎమ్మెల్యే భగత్‍కు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో నడిపే కేసీఆర్ వైపే ప్రజలు ఉన్నారని మరోసారి రుజువైందని అన్నారు. ఈ విజయం టీఆర్‍ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చిందన్నారు. పుర ఫలితాలలో కూడా కారు జోరు కొనసాగుతుందని తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోముల ఝాన్సీ, రవి, రాకేష్ లక్కరసు, రవి సాయల, వీరేందర్ సాంబ రాజు పాల్గొన్నారు.