ట్రెసా డైరీ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రెవెన్యూ డైరీని ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రెసా ప్రతినిధుల సమక్షంలో ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ డైరీలో రెవెన్యూ చట్టాలకు, ప్రభుత్వ జీవోలకు మరియు రెవెన్యూ శాఖకు సంబంధించిన విలువైన సమచారం పొందుపర్చారని అభినందించారు. ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృదం రెవెన్యూ శాఖ లోని పలు పెండిరగ్ అంశాలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.













