తెలంగాణలో అదనపు కలెక్టర్ల బదిలీలు
తెలంగాణలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని మేడ్చల్‌కు బదిలీ చేసింది. మేడ్చల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న విద్యాసాగర్‌ను రెవిన్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీ. రమేశ్‌ను మెదక్ అదనపు కలెక్టర్‌గా, మోహన్ రావును సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా నియమించింది. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న రాంబాబును నిర్మల్‌కు బదిలీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా ఉన్న రాజేశంను ఆసిఫాబాద్‌కు పంపింది. మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉన్న వెంకటేశ్వర్లును హైదరాబాద్‌కు, జోగులాంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని నాగర్ కర్నూలుకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మేనేజర్‌గా ఉన్న రఘురామ శర్మను జోగులాంబ గద్వాలకు బదిలీ చేసింది. నాగర్ కర్నూలు అదనపు కలెక్టర్‌గా ఉన్న మధుసూదన్ నాయక్‌ను మంచిర్యాలకు బదిలీ చేసింది. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉన్న సంధ్యారాణిని వరంగల్ అర్బన్‌కు, వరంగల్ రూరల్ అదనపు కలెక్టర్‌గా హరిసింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













