రైతు సమన్వయ కమిటీలు కావు… టీఆర్ఎస్ కమిటీలు
రైతు సమన్వయ కమిటీలు కావు… టీఆర్ఎస్ కమిటీలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు. నల్గొండ లోక్‌సభ ఉపఎన్నిక వస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని ఉత్తమ్ సవాల్ విసిరారు. 2019లో కాంగ్రెస్‌దే గెలుపని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… నగరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రైతు బాట పేరిట వందల రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, సీఎల్పీనేత కె. జానారెడ్డి, దామోదర్ రెడ్డి హాజరైయ్యారు.













