ముందు నుంచి చెప్పిందే.. ఇప్పుడు జరిగింది : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌ను కలిశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపై రెేవంత్రెడ్డి స్పందించారు. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇపుడు జరిగిందని పేర్కొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తనతో కలిసి
ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ను ఓడిరచండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారని తెలిపారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటనే ఫైనల్‌గా ఉంటుందని తెలిపారు.













